నైరుతికి తోడైన అల్పపీడనం… ఇక మస్తు వానలే!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రెండు మూడు రోజుల పాటు వర్షాలు హెచ్చరించిన వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలపై పూర్తిగా విస్తరించిన నైరుతి రుతుపవనాలకు అల్పపీడనం తోడైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణల్లో వచ్చే రెండు మూడు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని కూడా అంచనా వేశారు. ఇది ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉందని తెలిపారు. దీని కదలికలను గమనిస్తున్నామన్నారు.

readMore

విజయసాయిరెడ్డి, రమణ దీక్షితులకు నోటీసులు జారీ చేసిన టీటీడీ

టీటీడీ, ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్న టీటీడీ వివరణ ఇవ్వాలంటూ నోటీసులు తిరుమల, తిరుపతి దేవాస్థానాల ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు తిరుమల ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిలకు టీటీడీ బోర్డు నోటీసులు జారీ చేసింది. వీరు చేసిన వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొంది. టీటీడీపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని తెలిపింది. గత నెల 15వ తేదీన చెన్నైలో రమణ దీక్షితులు మాట్లాడుతూ… టీటీడీ, ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే విజయసాయి రెడ్డి కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. టీటీడీ పోటులో తవ్వకాలు జరిగాయని, చంద్రబాబు ఇంట్లో సోదాలు నిర్వహిస్తే నగలు బయట పడతాయని విజయసాయి ఆరోపించారు. ఈ నేపథ్యంలో, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా…

readMore

జయనగర్ బై పోల్స్… విజయాన్ని ఖాయం చేసుకున్న సౌమ్యా రెడ్డి!

ముగిసిన 8 రౌండ్ల కౌంటింగ్ 10 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో సౌమ్యా రెడ్డి కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు బీజేపీ అభ్యర్థి మరణంతో ఉప ఎన్నిక జరిగిన బెంగళూరు పరిధిలోని జయనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిని, మాజీ హోమ్ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి తన విజయాన్ని దాదాపు ఖాయం చేసుకున్నారు. ఈ ఉదయం నుంచి కౌంటింగ్ జరుగుతుండగా, 8వ రౌండ్ లెక్కింపు ముగిసేసరికి ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ తరఫున పోటీ చేసిన దివంగత బిఎన్‌ విజయ్‌ కుమార్‌ సోదరుడు బిఎన్‌ ప్రహ్లాద్‌ కన్నా 10 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో దూసుకెళుతున్నారు. 8వ రౌండ్ తరువాత కాంగ్రెస్ అభ్యర్థినికి 31,642, బీజేపీఅభ్యర్థికి 21,437 ఓట్లు రాగా, నోటాకు 361 ఓట్లు వచ్చాయి. సౌమ్యా రెడ్డి గెలుపు ఖాయం కావడంతో, ఆమె అనుచరులు,…

readMore

తిరుమల వివాదం శ్రీవారి సృష్టే: తెలంగాణ సలహాదారు రమణాచారి కీలక వ్యాఖ్యలు

కొండపై ఏదో మార్పును కోరుకుంటున్న స్వామి ఆయన ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు టీటీడీ మాజీ ఈఓ కేవీ రమణాచారి తిరుమలలో నెలకొన్న వివాదం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సృష్టేనని, ఆయనే ఏ కారణం చేతనో ఈ వివాదాన్ని సృష్టించారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, టీటీడీ మాజీ కార్యనిర్వహణాధికారి కేవీ రమణాచారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, తిరుమల కొండపై ఏదో మార్పును స్వామివారు కోరుకుంటున్నారని, అందుకే ఈ వివాదం వచ్చిందని అభిప్రాయపడ్డ ఆయన, స్వామివారి ప్రతిష్ఠకు భంగం కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు,. స్వామివారి ఆజ్ఞలేనిదే తిరుమల కొండపై ఏమీ జరగదని, ఈ విషయం తనకు చాలా బాగా తెలుసునని ఆయన చెప్పారు.

readMore

అభిమానుల కోసం అలసటను లెక్కచేయని చిరూ

‘సైరా’ షూటింగులో చిరంజీవి డిసెంబర్ నాటికి చిరూ పోర్షన్ పూర్తి జనవరి నుంచి కొరటాలతో సెట్స్ పైకి కొంతకాలంగా చిరంజీవి ‘సైరా’ సినిమా షూటింగులో పాల్గొంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఆయన ఆంగ్లేయులపై పోరాడే యోధుడుగా కనిపించనున్నారు. కథాపరంగాను .. ఖర్చు పరంగాను ఈ సినిమా భారీతనంతో కూడినది. అందువలన చిరంజీవి ఎంతో శ్రమకోర్చి ఈ షూటింగులో పాల్గొంటున్నారట. ఇటీవల ఒకవైపున మండుటెండల్లోను .. మరో వైపున లైట్ల వేడిని తట్టుకుంటూ ఆయన యాక్షన్ సీన్స్ లో పాల్గొన్నారు. వాతావరణం అనుకూలించని కారణంగా చిరూ అలసటకు లోనవుతున్నా, అభిమానులను నిరాశపరచకూడదనే ఉద్దేశంతో అలసటను లెక్కచేయలేదట. ఈ సినిమాకి సంబంధించి డిసెంబర్ నాటికి చిరంజీవి పోర్షన్ ను పూర్తి చేస్తారట. ఆ తరువాత మిగతా సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతుంది. జనవరి నుంచి కొరటాల సినిమాతో…

readMore