180 కోట్ల బడ్జెట్ తో రానా ‘హిరణ్యకశిప’

‘గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్యకశిప’
నిర్మాతగా సురేశ్ బాబు
భారీ సెట్స్ కి సన్నాహాలు
‘రుద్రమదేవి’తో భారీ చారిత్రక చిత్రాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించి ప్రశంసలు అందుకున్న గుణశేఖర్, తన తదుపరి చిత్రంగా ‘హిరణ్యకశిప’ ఉంటుందని ప్రకటించి చాలా రోజులైంది. ఈ పౌరాణిక సినిమాలో ప్రధానమైన పాత్రను రానా పోషించే ఛాన్స్ ఉందని కూడా ఆయన చెప్పాడు. ఇటీవల ఒక వేదికపై నిర్మాత సురేశ్ బాబు మాట్లాడుతూ, ఈ సినిమాలో రానా చేయబోతున్న విషయాన్ని స్పష్టం చేశాడు. తన బ్యానర్లోనే ఈ సినిమా రూపొందనుందని అన్నాడు.

ఈ సినిమా కోసం 180 కోట్లను ఖర్చు చేయనున్నారనేది తాజా సమాచారం. ప్రముఖ ఆర్టిస్ట్ ముఖేశ్ సింగ్ తో ఈ సినిమాకి అవసరమైన రాజప్రాసాదాలు .. మంటపాలు .. దేవలోకం .. వైకుంఠం .. ఉద్యానవనాలు వంటి సెట్స్ ను గీయిస్తున్నారట. కాస్ట్యూమ్స్ విషయంలోను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గ్రాఫిక్స్ కి కూడా పెద్దపీట వేస్తూ ఈ సినిమాను ఒక విజువల్ వండర్ లా తీర్చిదిద్దడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

Related posts

Leave a Comment