వంద కోట్ల ‘రంగస్థలం’

100 Crore Pre Release Business ForCharans Rangasthalam

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ అన్నపుడు.. వీళ్లిద్దరికీ ఏమాత్రం సింక్ అవుతుందో అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ సినిమా మొదలయ్యే సమయానికి చరణ్ వరుసగా ఊర మాస్ సినిమాలే చేస్తూ వచ్చాయి. సుకుమార్ చూస్తే పక్కా క్లాస్ సినిమాలతో సాగిపోతున్నాడు. మరి వీళ్లిద్దరి కాంబినేషన్ వర్కవుట్ అవుతుందా.. ఈ చిత్రానికి అనుకున్న స్థాయిలో హైప్ వస్తుందా అని చాలామంది అనుమానించారు. కానీ రామ్ చరణ్ ఈజీగానే సుకుమార్ మార్కు హీరోగా రూపాంతరం చెందాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా ఒక ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేయకపోయినా.. అప్పుడప్పుడూ ఆన్ లొకేషన్ పిక్స్ లాంచ్ చేస్తూ.. సినిమాకు సంబంధించిన ముచ్చట్లు పంచుకుంటూ ఇటు జనాల్లో.. అటు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి తీసుకురాగలిగింది చిత్ర బృందం.

‘రంగస్థలం’ సినిమాకు క్రేజ్ ఏ స్థాయిలో వచ్చిందంటే.. ఈ చిత్రానికి రూ.100  కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా థియేట్రికల్ హక్కుల సంగతేంటో తెలియకుండానే రూ.35 కోట్ల దాకా ఆదాయం నిర్మాతకు సమకూరడం విశేషం. ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని మా టీవీ.. డిజిటల్ హక్కుల్ని అమేజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నాయి. ఈ రెండు హక్కులూ కలిపి రూ.20 కోట్ల దాకా పలకడం విశేషం. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.10.5 కోట్లకు అమ్ముడయ్యాయి. మ్యూజిక్ రైట్స్ రూ.1.5 కోట్లకు అమ్మారట. ఇతర రైట్స్ అవీ కలిపితే రూ.35 కోట్ల దాకా లెక్క తేలుతోంది. ఈ చిత్ర థియేట్రికల్ హక్కుల కోసం అన్ని ఏరియాల నుంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. ఓవర్సీస్ హక్కులే రూ.15 కోట్లకు పైగా పలుకుతున్నాయి. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల హక్కులన్నీ కలిపితే రూ.65 కోట్లు ఈజీగా దాటిపోతాయి. అంటే విడుదలకు ముందే రూ.100 కోట్లకు పైగా ఆదాయం తెచ్చిపెట్టబోతోందన్నమాట ‘రంగస్థలం’.

Related posts

Leave a Comment