హ్యాపీ బర్త్‌డే మై లవ్‌: మహేశ్‌

టాలీవుడ్‌లో చూడముచ్చటైన జంటల్లో మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్‌ ఒకరు. ‘వంశీ’ సినిమాలో వీరిద్దరి ఆన్‌స్క్రీన్‌ జోడీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. నిజజీవితంలోనూ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అనిపించారు.

కాగా.. ఈరోజు నమ్రత పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేశ్‌ తన ప్రియమైన భార్యకు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపి చూడచక్కని ఫ్యామిలీ ఫొటోను షేర్‌ చేశారు. ‘నువ్వు నాకెంత ప్రత్యేకమో చెప్పడానికి మరో కారణం. హ్యాపీ బర్త్‌డే టు మై లవ్‌, మై బెస్ట్‌ ఫ్రెండ్‌, మై వైఫ్‌’ అంటూ మహేశ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.
నమ్రత కూడా ఎప్పటికప్పుడు తన భర్త, పిల్లలు గౌతమ్‌, సితారలకు సంబంధించిన ఫొటోలు పోస్ట్‌ చేస్తూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.
1993లో ఫెమీనా మిస్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకున్న నమ్రత 2000లో ‘వంశీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తరువాత ‘అంజి’తో పాటు పలు బాలీవుడ్‌ చిత్రాల్లోనూ నటించారు. ‘వంశీ’ సినిమా సమయంలో మహేశ్, నమ్రత ప్రేమించుకున్నారు. 2005లో ఇద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. వివాహం అనంతరం నమ్రత సినిమాలకు స్వస్తి పలికారు.
ప్రస్తుతం మహేశ్‌ ‘భరత్‌ అనే నేను’ సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కైరా అడ్వాణీ కథానాయిక. మరోపక్క వంశీ పైడిపల్లి సినిమాలోనూ మహేశ్ నటిస్తున్నారు.

Related posts

Leave a Comment