హైదరాబాద్ శివార్లలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి!

తుర్కపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
మృతులు జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన వారిగా గుర్తింపు
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
హైదరాబాద్ శివార్లలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం తుర్కపల్లి వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మృతులు జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతులు రాజు (24), సత్తవ్వ (35), శ్రవణ్ (12), శాలిని (12). సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.

Related posts

Leave a Comment