హైదరాబాద్ లో శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ అరెస్ట్‌

fake mbbs doctor arrested in hyerabad

నకిలీ ఆయుర్వేద వైద్యుడి అరెస్ట్‌

హైదరాబాద్: క్యాన్సర్‌, పక్షవాతం, మూర్చ వ్యాధులకు మందులిచ్చి నయం చేస్తానంటూ  ప్రజలను నమ్మించి మోసగిస్తున్న నకిలీ ఆయుర్వేద వైద్యుడిని పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి నకిలీ ఆయుర్వేద, అలోపతి మందులు, వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… హర్యానాలోని పానిపత్‌ సమల్కా కృష్ణాకాలనీకి చెందిన రాఖేష్‌వర్మ అలియాస్‌ భల్లా (37) పదో తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి వద్ద ఆయుర్వేద వైద్యం నేర్చుకున్నాడు.  తండ్రి వద్ద అరకొరగా నేర్చుకున్న ఆయుర్వేద వైద్యంనే వృత్తిగా చేసుకున్నాడు. రెండేళ్ల క్రితం చెంగిచెర్ల ప్రాంంతలోని సోదరి వద్దకు వచ్చి ఉంటున్నాడు. ఆయుర్వేద వైద్యుడి అవతారం ఎత్తి వ్యాధులకు చికిత్స చేస్తానని రూ.50వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నాడు. ఇతని వద్ద కుల్సుంపురాకు చెందిన ఓ వ్యక్తి తన తల్లికి వైద్యం చేయించగా వైద్యం వికటించింది. దీంతో సదరు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు డీసీపీ పి.రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు ఆదేశాలతో శుక్రవారం నకిలీ వైద్యుడు రాఖేష్‌వర్మ అలియాస్‌ భళ్లా (37)ను అరెస్టు చేసి స్థానిక కుల్సుంపురా పోలీసులకు అప్పగించారు.

Related posts

Leave a Comment