హైదరాబాద్ లో మొదలైన ‘సాహో’ షూటింగ్

సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’
ప్రభాస్ సరసన శ్రద్ధ కపూర్
హైలైట్ గా నిలిచే యాక్షన్ సీన్స్
ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ వారు ‘సాహో’ సినిమాను రూపొందిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇటీవలే దుబాయ్ లో మేజర్ షెడ్యూల్ షూటింగును జరుపుకుంది. హాలీవుడ్ తరహాలో భారీ యాక్షన్ సీన్స్ ను అక్కడ చిత్రీకరించారు. ఆ తరువాత షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ రోజు నుంచి హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇది చాలా కీలకమైన షెడ్యూల్ అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తారట. నాయకా నాయికలకి సంబంధించిన సన్నివేశాలు .. కుటుంబ నేపథ్యంలో సన్నివేశాల చిత్రీకరణ ఈ షెడ్యూల్లో ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్స్ .. శ్రద్ధ కపూర్ గ్లామర్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.

Related posts

Leave a Comment