హీరోయిన్ రెజీనాకు హైదరాబాద్ పోలీసుల వార్నింగ్!

‘కికి’ చాలెంజ్ స్వీకరించిన రెజీనా
నడుస్తున్న కారు దిగి డ్యాన్స్
ప్రమాదకరమని చెబుతున్న అధికారులు
కఠిన చర్యలు ఉంటాయన్న ట్రాఫిక్ పోలీసులు
సోషల్ మీడియా పుణ్యమాని వైరల్ అయిన ‘కికి’ చాలెంజ్ ప్రమాదకరమని చెబుతున్నా, వినని హీరోయిన్ రెజీనా కసాండ్రాను హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఈ చాలెంజ్ ను స్వీకరించిన రెజీనా, నడుస్తున్న కారు డోర్ తీసుకుని కిందకు దిగి, కొద్దిసేపు డ్యాన్స్ చేస్తూ, కారుతో పాటే నడిచి, తిరిగి కారు ఎక్కింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, అది వైరల్ అయింది. సెలబ్రిటీలు ఇలా ప్రాణాంతకపు పనులు చేస్తే, పలువురు దాన్ని అనుసరిస్తారని, ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడవచ్చని ట్రాఫిక్ ఏసీపీ అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ తరహా పనులు చేయవద్దని రెజీనాను హెచ్చరించారు. హైదరాబాద్ రోడ్లపై ‘కికి’ చాలెంజ్ స్వీకరిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ చాలెంజ్ వల్ల ట్రాఫిక్ కు ఇబ్బందులు వస్తాయని తెలిపారు.

Related posts

Leave a Comment