హిమాదాస్‌.. దేశం నిన్ను చూసి గర్విస్తోంది: మోదీ

ఫిన్‌లాండ్‌లో జరుగుతున్న ఐఏఏఎఫ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌
తొలి స్వర్ణం సాధించిన భారత మహిళగా హిమాదాస్‌ రికార్డు
ప్రశంసలు కురిపిస్తోన్న ప్రముఖులు
ఫిన్‌లాండ్‌లో జరుగుతున్న ఐఏఏఎఫ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తొలి స్వర్ణం సాధించిన భారత మహిళగా హిమాదాస్‌ రికార్డు సృష్టించింది. అండర్-20 విభాగంలో 400మీటర్ల ఫైనల్లో కేవలం 51.46 సెకన్లలో గమ్యాన్ని చేరి బంగారు పతకాన్ని తన సొంతం చేసుకుంది. ఛాంపియన్‌షిప్‌లో హిమాదాస్‌ విజేతగా నిలిచి దేశం గర్వపడేలా చేయడం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలతో పాటు అనేక మంది ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related posts

Leave a Comment