హాట్‌ హాట్‌ కత్రినా!

బాలీవుడ్‌ బార్బీబొమ్మ కత్రినా కైఫ్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందాలతోనే కాదు, నటనతోనూ యువ హృదయాలను కొల్లగొట్టిన ఈ భామ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్‌ చేసింది. హాట్ ‌హాట్‌ దుస్తులతో ఉన్న ఈ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలో వెనుక నుంచి పొగ వెలువడుతున్న దృశ్యం చూస్తుంటే ఏదైనా ప్రచార చిత్రానికి సంబంధించిన ఫొటో షూట్‌లా ఉంది. అయితే అది సినిమాలోని ఏదైనా పాటకు సంబంధించినదా? లేక ప్రచార చిత్రమా? అనేదిపై స్పష్టత లేదు. గత సంవత్సరం సల్మాన్ హీరోగా నటించిన బ్లాక్‌ బస్టర్ మూవీ ‘టైగర్‌ జిందా హై’తో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో కత్రినా పాకిస్థాన్ ఏజెంటుగా చేసిన పోరాటాలకు ప్రశంసలు దక్కాయి.

ప్రస్తుతం ఆమె బాలీవుడ్ స్టార్ హీరోలు ఆమీర్‌ ఖాన్‌తో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, షారుక్‌ ఖాన్ ‘జీరో’ ‌సినిమాల్లో నటిస్తోంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వస్తోన్న జీరో సినిమా డిసెంబరు 20న విడుదల కానుంది. ఇందులో అనుష్క శర్మ కూడా నటిస్తున్నారు. వీరు ముగ్గురు కలిసి గతంలో ‘జబ్‌ తక్‌ హై జాన్‌’ సినిమాలో స్క్రీన్‌ షేర్ చేసుకున్నారు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తోన్న ‘థగ్స్‌ ఆఫ్ హిందుస్థాన్’ నవంబరు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts

Leave a Comment