హరికృష్ణ కుటుంబానికి వరుసగా అక్కడే ప్రమాదాలు!

గతంలో ఇక్కడే జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జానకి రామ్
2009 ఎన్నికల్లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్
ఇప్పుడు హరికృష్ణ
నల్గొండ జిల్లాకు, నందమూరి హరికృష్ణ కుటుంబానికి ఏమిటీ సంబంధం? నందమూరి కుటుంబ సభ్యులు అక్కడే ఎందుకు ప్రమాదానికి గురవుతున్నారు? ప్రముఖ సినీ నటుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ (61) కారు ప్రమాదానికి గురవడంతో ఇప్పుడీ చర్చ తెరపైకి వచ్చింది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌‌కు కారులో వస్తుండగా జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల దగ్గర హరికృష్ణ కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఆయన తీవ్ర గాయాలపాలై నందమూరి హరికృష్ణ దుర్మరణం . ప్రస్తుతం రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 2009లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ కూడా అక్కడే ప్రమాదానికి గురయ్యారు. అయితే, ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు అదే ప్రాంతంలో హరికృష్ణ కారు ప్రమాదానికి గురికావడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

Related posts

Leave a Comment