స్వామి పరిపూర్ణానంద ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత

భజరంగ్‌ దళ్‌, వీహెచ్‌పీ నాయకులు అరెస్ట్‌
పోలీసులకు, హిందూ సంఘాల నాయకులకి మధ్య తోపులాట
పరిపూర్ణానంద వద్దకు వస్తోన్న హిందూ సంఘాల కార్యకర్తలు
హిందూ ధర్మంపై జరుగుతోన్న దాడులకు నిరసనగా శ్రీ పీఠాధిపతి, రాష్ట్రీయ హిందూ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి పరిపూర్ణానంద ‘ధర్మాగ్రహ యాత్ర’ ప్రారంభించనున్నట్లు ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌, జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు చేరుకుంటుండడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఇప్పటికే ఆయన నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు… భజరంగ్‌ దళ్‌, వీహెచ్‌పీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకి, వారికి మధ్య తోపులాట జరిగింది. వారిని పోలీసులు గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్‌కి తరలించినట్లు తెలుస్తోంది.

Related posts

Leave a Comment