‘సైరా’లో చిరూకి అండగా నిలిచే పాత్రలో విజయ్ సేతుపతి

షూటింగు దశలో ‘సైరా’
భారీ సన్నివేశాల చిత్రీకరణ
‘ఓబయ్య’గా విజయ్ సేతుపతి
చిరంజీవి కథానాయకుడుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా’ సినిమా రూపొందుతున్న సంగతి విదితమే. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, ఇతర ముఖ్య పాత్రల్లో అమితాబ్ .. జగపతిబాబు .. సుదీప్ .. విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఇటీవల విజయ్ సేతుపతి మాట్లాడుతూ .. ఈ సినిమాలో తాను తమిళుడుగానే కనిపిస్తానని అన్నాడు. దాంతో ఆయన పాత్రపై అందరిలో ఆసక్తి మొదలైంది. ఆయన ఈ సినిమాలో ఆయన ‘ఓబయ్య’ అనే పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఆంగ్లేయులతో పోరాట సమయంలో తెలుగువారిని .. తమిళులని ఏకం చేయడానికి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ప్రయత్నిస్తాడట. ఆ ప్రయత్నంలో ఆయనకి కుడిభుజంగా ఓబయ్య వ్యవహరిస్తాడని అంటున్నారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ పాత్రను తీర్చిదిద్దారని తెలుస్తోంది. విజయ్ సేతుపతి కెరియర్లో ఇది చెప్పుకోదగిన పాత్ర అవుతుందని అంటున్నారు.

Related posts

Leave a Comment