సెన్సార్‌ పాలైన విజయ్‌ దేవరకొండ నోటా

Vijay devarakonda NOTA movie Dialogues sensored

విజయ్‌ దేవరకొండ యూత్‌కి కనక్ట్‌ అయ్యే సీన్లు, డైలాగులు పెట్టేసి తన సినిమాల రేంజ్‌ పెంచేసుకుంటున్నాడు. అర్జున్‌రెడ్డిలో బాగా కలిసి వచ్చిన ఇదే ట్రిక్కుని ‘నోటా’లో కూడా చూపించాలని చూసాడు. అయితే రాజకీయ నేపథ్యమున్న ఈ చిత్రం ఎన్నికల ముందు రిలీజ్‌ అవుతోంది కనుక దేవరకొండ ఆటలు చెల్లలేదు. బూతు మాటలు పెట్టినట్టయితే దుమారం రేగుతుందని, సెన్సార్‌ బోర్డుపై విమర్శలు వెల్లువెత్తుతాయని ఈ చిత్రంలో చాలా డైలాగులని మ్యూట్‌ చేసేసారట. విజయ్‌ ఎంత నచ్చ చెప్పడానికి చూసినా కానీ సెన్సార్‌ బోర్డు దిగి రాకపోవడంతో ఆ డైలాగులు మ్యూట్‌ అయిపోయాయి.

అర్జున్‌రెడ్డికి చేసినట్టుగా ముందుగా ట్రెయిలర్‌ రిలీజ్‌ చేసేసి ఆ డైలాగులని పాపులర్‌ చేసేసి వుండాల్సింది. అయితే అలా ముందే ట్రెయిలర్‌లో పెడితే సినిమాని విడుదల కానివ్వరని నిర్మాత వారించడంతో వాటిని ట్రెయిలర్‌లోకి రానివ్వలేదు. తీరా సినిమాలో డైలాగులు మ్యూట్‌ అయిపోవడంతో ‘రౌడీ’ ఇమేజ్‌ వున్న విజయ్‌ దేవరకొండ అభిమానులైన యువత కనక్ట్‌ అయ్యే చాలా సీన్ల ఇంపాక్ట్‌ తగ్గిందట. అసలే ఇది సీరియస్‌ పొలిటికల్‌ సినిమా కావడంతో విజయ్‌ ఫుల్‌ పొటెన్షియల్‌ వాడుకునే వీల్లేదనేది మేకర్స్‌కి తెలుసు. క్లిక్‌ అవుతాయని భావించిన డైలాగులేమో ఇలా సెన్సార్‌ పాలైపోయాయి. నోటాకి దీని వల్ల ఎక్కువ డ్యామేజ్‌ జరగదనే ఆశిద్దాం.
Tags: NOTA movie Dialogues,NOTA Cuts Words,vijay devarakonda

Related posts

Leave a Comment