సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

రవితేజ సినిమా షూటింగులో ఇలియానా
ప్రభాస్ సినిమా కోసం యూరప్ వాతావరణం!
నిర్మాతగా మారిన అందాలతార
* రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. చిత్ర కథానాయిక ఇలియానా నిన్న ఈ చిత్రం షూటింగులో జాయిన్ అయింది. చాలా కాలం తర్వాత తను చేస్తున్న తెలుగు సినిమా కావడంతో ఈ ముద్దుగుమ్మ ఎగ్జయిట్ అవుతోందట.
* ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సాహో’ చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీలో యూరప్ వాతావరణాన్ని తలపించే విధంగా సెట్స్ ను వేస్తున్నారు. ఈ చిత్రం యూరప్ నేపథ్యంలో ఎక్కువగా సాగుతుంది. దాంతో అక్కడి ఇంటి నిర్మాణాలను.. రోడ్లను తలపించే విధంగా భారీ సెట్స్ ను వేస్తున్నారట.
* అందాలతార శ్రుతిహాసన్ నిర్మాతగా కూడా మారుతోంది. ‘ది మస్కిటో ఫిలాసపీ’ పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి జయప్రకాష్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహిస్తారని, ఈ కథ తనకు బాగా నచ్చడంతో నిర్మించడానికి పూనుకున్నానని శ్రుతి చెప్పింది.

Related posts

Leave a Comment