సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

సుధీర్ బాబుతో జతకట్టనున్న మెహ్రీన్
ఏఎల్ విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్
మలయాళ చిత్రంలో ‘గూఢచారి’ నాయిక
* సుధీర్ బాబు సరసన మెహ్రీన్ కథానాయికగా నటించనుంది. నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో రూపొందే చిత్రంలో వీరిద్దరూ జంటగా నటిస్తారు. ఈ చిత్రం షూటింగ్ రేపు ప్రారంభమవుతుంది. తమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.
* రాంచరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్న సంగతి విదితమే. ఇందుకు గాను ఆయనకు 4 కోట్ల భారీ పారితోషికాన్ని ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఓ బాలీవుడ్ నటుడుకి ఈ స్థాయిలో తెలుగు సినిమాకి పారితోషికం ఇవ్వడం విశేషమే!
* ‘గూఢచారి’ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన కథానాయిక శోభిత ధూళిపాళ మలయాళ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. యంగ్ హీరో నివిన్ పౌలీ సరసన ‘మూతోన్’ అనే సినిమాలో శోభిత నటించనుంది.

Related posts

Leave a Comment