‘సిద్దూ ప్లస్‌టూ’ చిత్రంతో పరిచయమైన నటి చాందిని

శాంతను కథానాయకుడిగా నటించిన ‘సిద్దూ ప్లస్‌టూ’ చిత్రంతో పరిచయమైన నటి చాందిని. 2008లో మిస్‌ చెన్నై పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన ఈ అమ్మడు తెలుగులో కిరాక్‌, చిత్రం భలారే విచిత్రం, తమిళంలో విల్‌ అంబు, నయ్యప్పుడై, కాన్నుల కాస కాటప్పా, ఎన్నోడు విలయాడు, కవన్‌ వంటి పలు చిత్రాల్లో నటించింది. ఇటీవల వచ్చిన ‘బలూన్‌’లోనూ అతిథి పాత్ర పోషించారు. ప్రారంభంలో అవకాశాలు అంతగా లేకపోయినా.. ప్రస్తుతం తమిళంలో చేతినిండా సినిమాలతో ఈమె బిజీగా ఉంది. తామి, కాదల్‌ మున్నేట్ర కళగం, పల్లాండు వాళ్‌గ, నాన్‌ అవలై సందిత్తపోదు, రాజా రంగూస్కి, వనంగాముడి తదితర పది చిత్రాల్లో నటిస్తోంది. ఈ సందర్భంగా తన చిత్ర విశేషాల గురించి ఈ అమ్మడు మాట్లాడుతూ చదువుకునే రోజుల్లోనే చాలా వెబ్‌ సీరీస్‌లలో నటించే అవకాశం వచ్చింది. కానీ అంగీకరించలేదు. సినిమాలో నటించాలన్నదే నా కోరిక. అలా 2015లో విల్‌ అంబు చిత్రంతో అడుగుపెట్టా. జ్యోతిక నాకు స్ఫూర్తి. సినీ రంగంతోపాటు బయట ఆమె జీవితమంటే చాలా ఇష్టం. గ్లామర్‌ కూడా నటనలో భాగమే అనుకుంటున్నా. కథకు అవసరమైతే గ్లామర్‌గా నటించడానికి సిద్ధమే. అందరూ ఆశ్వాదించే విధంగా మాత్రమే అందాలు ఆరబోస్తా. అలాగని అడల్ట్‌ చిత్రాల్లో నటించడం ఇష్టం లేదు. అందాల ఆరబోతకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి. ప్రస్తుతం ‘రాజా రంగూస్కి’, ‘వంజగర్‌ ఉలగం’, ‘సదురంగవేట్టై 2’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు కథానాయిక ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో మాత్రమే నటించా. ఇకపై కూడా అలాంటి కథలనే ఎంచుకుంటానని పేర్కొన్నారు.

Related posts

Leave a Comment