సాయి పల్లవి మరో ప్రేమకథ

రకుల్ హిందీ చిత్రం అప్ డేట్స్
మూడు భాగాలుగా ధనుశ్ సినిమా
తేజ దర్శకత్వంలో యంగ్ హీరో
* ‘నీది నాది ఒక కథ’ చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. 90ల కాలం నాటి వాతావరణంలో సంప్రదాయబద్ధమైన మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య సాగే ప్రేమకథగా దీనిని రూపొందిస్తున్నారు. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటిస్తుంది.
* ఇటు తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా వున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీలో అజయ్ దేవగణ్ తో ఓ చిత్రాన్ని చేస్తోంది. రొమాంటిక్ కామెడీగా దీనిని రూపొందిస్తున్నారు. అకివ్ అలీ దర్శకత్వంలో లవ్ రంజన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సగం పూర్తయినట్టు రకుల్ తెలిపింది.
* తమిళ నటుడు ధనుశ్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వడ చెన్నయ్’ (ఉత్తర చెన్నయ్) చిత్రాన్ని మూడు భాగాలుగా నిర్మిస్తారట. మూడు దశాబ్దాల క్రితం ఉత్తర చెన్నయ్ ప్రాంతంలోని పేదల జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
* ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నట్టు సమాచారం.

Related posts

Leave a Comment