సన్నీలియోన్ కు వ్యతిరేకంగా బెంగళూరులో నిరసనలు

బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ పై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. ఆమెకు వ్యతిరేకంగా బెంగళూరులో కర్ణాటక రక్షణ వేదిక యువసేన ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కన్నడిగులు వీరనారిగా కొలిచే వీర మహాదేవి పాత్రను సన్నీలియోన్ పోషించడమే ఈ ఆగ్రహానికి కారణం.

ఈ సందర్భంగా కన్నడ సంఘాల నేతలు మాట్లాడుతూ, ‘అమోఘవర్ష నృపతుంగ’ కథ ఆధారంగా రూ. 100 కోట్ల బడ్జెట్ తో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని చెప్పారు. నీలి చిత్రాల్లో నటించిన సన్నీలియోన్ ఈ పాత్రను పోషించడం దారుణమని అన్నారు. ఈ సినిమా షూటింగ్ ను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.
Tags: veeranaari,sunnyleone, kannadigaru,veeramahadevi

Related posts

Leave a Comment