శ్రీదేవి కూతురు గ్లామర్‌ విందు!

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ అయిపోయింది. మొదటి సినిమా ఏది చేస్తుందనే మీమాంసకి తెర దించుతూ సైరాట్‌ అనే మరాఠీ చిత్రానికి హిందీ రీమేక్‌లో కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో జాన్వీ నటిస్తోంది. హీరోయిన్‌ కాకముందే గ్లామర్‌ అవుట్‌ఫిట్స్‌తో, నిత్యం కొత్త ఫ్యాషన్లతో న్యూస్‌లో వున్న జాన్వీ వెండితెరపై మాత్రం తన స్టయిల్లో కనిపించబోవడం లేదు. మొదటి సినిమాలో డీ గ్లామరైజ్డ్‌ క్యారెక్టర్‌ చేయడానికే జాన్వీ ప్రిఫర్‌ చేసింది.

బికినీ వేసి మొదటి సినిమాలోనే సంచలనం చేయవచ్చు కానీ అలా చేస్తే క్రేజ్‌ పడిపోతుందని, తెరపై గ్లామర్‌గా కనిపించడానికి డిలే చేసిన హీరోయిన్లకి వున్న క్రేజ్‌ ఏమిటనేది అధ్యయనం చేసిన శ్రీదేవి స్వయంగా ఈ నిర్ణయం తీసుకుందట. వచ్చిన చాలా ఆఫర్లు కాదని సైరాట్‌ రీమేక్‌ చేయడానికి మరో కారణం కూడా వుందట. ఈ చిత్రమయితే జాన్వీకి మొదటి సినిమాతోనే నటిగా గుర్తింపు వస్తుందని, తద్వారా ఆమెని ఈజీగా ఇండస్ట్రీ గుర్తిస్తుందని శ్రీదేవి భావించిందట.

తెరపై ఎలా కనిపించనున్నా కానీ బయట మాత్రం తన అందాల విందుని జాన్వీ కంటిన్యూ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌ పిక్చర్స్‌లో జాన్వీ ఫోటోలు ప్రతి రోజు ప్లేస్‌ సాధిస్తున్నాయంటేనే ఆమె ఊపేంటి అనేది చూసుకోండి.

Jhanvi Kapoor Hot, Jhanvi Kapoor Photos

Related posts

Leave a Comment