శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయాలనుందని చెప్పేసింది

అదితీరావు కథానాయికగా ‘సమ్మోహనం’
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సాగే కథ
శేఖర్ కమ్ముల సినిమాలంటే ఇష్టం
తెలుగు ప్రేక్షకులకు అదితీరావును కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఆమె తాజా చిత్రంగా ఈ నెల 15వ తేదీన ‘సమ్మోహనం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సుధీర్ బాబు జోడీగా చేసిన ఈ సినిమాపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె బిజీగా వుంది. “ఏ దర్శకుడి సినిమాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు?” అనే ప్రశ్న ఆమెకి ఈ సందర్భంలోనే ఎదురైంది.

సాధారణంగా ఇదే ప్రశ్నకి రాజమౌళి పేరునో .. సుకుమార్ పేరునో చెప్పేవారు ఎక్కువగా వుంటారు. కానీ అదితీరావు అందుకు భిన్నంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయాలని ఉందని చెప్పింది. శేఖర్ కమ్ముల కథాకథనాలను తయారు చేసుకునే తీరు .. వాటిని తెరపై ఆవిష్కరించే విధానం తనకి బాగా నచ్చుతాయని అంది. ఆయన సినిమాల్లో కథానాయిక పాత్రకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందనీ, అందువలన ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే ఎలాంటి పరిస్థితుల్లోను వదులుకోనని చెప్పింది. శేఖర్ కమ్ముల మూవీలో చేయాలనే ఈ సుందరి ముచ్చట ఎప్పుడు తీరేనో .. ఏమో.

Related posts

Leave a Comment