శర్వానంద్ కథకి రిపేర్లు చేస్తోన్న హను రాఘవపూడి?

ప్రేమకథా చిత్రంగా ‘పడిపడి లేచే మనసు’
శర్వానంద్ జోడీగా సాయిపల్లవి
కథలో మార్పులంటూ ప్రచారం
శర్వానంద్ కథానాయకుడిగా .. సాయిపల్లవి నాయికగా ‘పడి పడి లేచే మనసు’ సినిమా రూపొందుతోంది. వైవిధ్యభరితమైన ఈ ప్రేమ కథాంశానికి హను రాఘవపూడి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో సందడి చేయడం లేదు. దర్శకుడిగా హను రాఘవపూడి కథకి రిపేర్లు చేస్తుండటమే అందుకు కారణమనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

ఇటీవల వచ్చిన ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమాలో హీరోయిన్ కి మెమరీ లాస్ అవుతుంది. ఇదే పాయింట్ ‘పడి పడి లేచే మనసు’లో హీరోవైపు నుంచి వుంటుందట. అందువలన రెండు కథలు దగ్గరగా కనిపిస్తాయి కనుక, తన సినిమాలో కొత్తగా కొన్ని మార్పులు చేయడంలో హను రాఘవపూడి నిమగ్నమయ్యాడని అంటున్నారు. ఈ విషయంలో ఆయనకి సంతృప్తి కలిగితే అప్పుడు సెట్స్ పైకి వెళతారట. జోరుగా జరుగుతోన్న ఈ ప్రచారంపై ఈ సినిమా టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Related posts

Leave a Comment