శర్వానంద్‌కు జోడీగా..!

కథానాయికగా పదేళ్లు పూర్తిచేసుకున్నా కాజల్ అగర్వాల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. స్టార్ హీరోలతో మాత్రమే కలిసి నటించిన కాజల్ అ! సినిమా నుంచి తన పంథా మార్చుకుంది. పాత్ర నచ్చితే యువ హీరోలతోనూ కలిసి నటించడానికి సిద్ధపడుతున్న ఆమె తాజాగా మరో యువ హీరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. శర్వానంద్ హీరోగా సుధీర్‌వర్మ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం మరో షెడ్యూల్ జరుగుతున్నది. ఈ చిత్రంలో ప్రధాన నాయికగా కాజల్‌ను ఖరారు చేశారు. మరో నాయికగా హలో ఫేమ్ కల్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నది. శర్వానంద్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇటీవలే కాజల్ ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నదని, ఇందులో ఆమె డాక్టర్‌గా కనిపించనుందని తెలిసింది. ప్రస్తుతం కాజల్‌అగర్వాల్ తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రెండు చిత్రాల్లో నటిస్తున్నది. సంతోష్‌శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా రూపొందనున్న చిత్రాన్ని కూడా అంగీకరించింది. క్వీన్ తమిళ రీమేక్ పారిస్ పారిస్‌లో కాజల్ అగర్వాల్ కథానాయికగానటిస్తున్న విషయం తెలిసిందే.

Related posts

Leave a Comment