వైఎస్ జయంతి రోజున ‘యాత్ర’ టీజర్ రిలీజ్

వైఎస్ బయోపిక్ గా ‘యాత్ర’
ప్రధానమైన పాత్రలో మమ్ముట్టి
ముఖ్యమైన పాత్రల్లో జగపతిబాబు .. సుహాసిని
వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ను ‘యాత్ర’ పేరుతో దర్శకుడు మహి.వి రాఘవ్ రూపొందిస్తున్నాడు. మమ్ముట్టి ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమా టీజర్ కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ఆ రోజున రాజశేఖర్ రెడ్డి జయంతి కావడం వలన ఈ నిర్ణయం తీసుకున్నారట. జగపతిబాబు .. సుహాసిని .. రావు రమేశ్ .. అనసూయ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం .. ప్రజలపై ఆయన చూపిన ప్రభావం ప్రధానంగా ఈ సినిమా కొనసాగుతుందని చెబుతున్నారు.

Related posts

Leave a Comment