వైఎస్‌ జగన్‌ను కలిసిన చోటా కే నాయుడు

మండపేట నియోజవర్గంలో కొనసాగుతున్న జగన్ పాదయాత్ర
జగన్ ను కలిసి, మద్దతు ప్రకటించిన చోటా కే నాయుడు
రాజన్న రాజ్యం రావాలంటే జగన్ సీఎం కావాలన్న చోటా
ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు మంచి ఆదరణ లభిస్తోంది. ఎంతో మంది ఆయనతో కలసి అడుగులు వేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఆయనను కలసి మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు జగన్ ను కలిశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం సోమేశ్వరంలో కొనసాగుతున్న పాదయాత్రలో జగన్ కలసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా చోటా కే నాయుడు మాట్లాడుతూ, రాజన్న రాజ్యం రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ఇప్పటికే సినీ నటులు పోనాని కృష్ణ మురళి, పృథ్వీలు జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే.

Related posts

Leave a Comment