వెయ్యి కోట్ల జీఎస్‌టీ ఎగవేత

హైదరాబాద్‌: వివిధ రంగాల్లో వెయ్యి కోట్లకు పైగా వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ఎగవేతకు పాల్పడినట్లు తెలంగాణ రాష్ట్ర జీఎస్‌టీ అధికారులు గుర్తించారు. 11 ప్రధాన రంగాల నుంచి ఈ సొమ్ము రావాల్సి ఉన్నట్లు అంచనా వేసిన ఉన్నతాధికారులు.. ప్రత్యేక అధికారులను నియమించి అధ్యయనం చేస్తున్నారు. అంశాల వారీగా నిగ్గుతేల్చి, నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

దేశవ్యాప్తంగా గతేడాది జులై నుంచి జీఎస్‌టీ అమలులోకి వచ్చింది. ఏడాది గడుస్తున్నా కొన్ని సంస్థలు ఇప్పటికీ రూపాయి కూడా పన్ను చెల్లించలేదు. ప్రముఖ విద్యాసంస్థలు, ఎయిర్‌లైన్స్, ప్రధాన బ్యాంకులు, బీమా సంస్థలు, పేరు మోసిన బస్సు యాజమాన్యాలు ఎక్కువ మొత్తంలో బకాయిలు ఉన్నట్లు అంచనా. ఈ సంస్థల నుంచి రూ.వెయ్యికోట్లకు పైగా పన్నులు రావాల్సి ఉందని అధికారులు భావిస్తున్నారు. వినియోగదారుల నుంచి ముక్కు పిండి జీఎస్‌టీ వసూలు చేస్తున్నా.. ప్రభుత్వానికి మాత్రం రూపాయి కూడా చెల్లించకుండా తమ వద్దే ఉంచుకున్నారు. విద్యాసంస్థలు, ప్రైవేటు కళాశాలలు, కోచింగ్‌ సెంటర్లు, ట్రావెల్‌ సంస్థలు నడుపుతున్న ఏసీ బస్సులు, బీమా సంస్థలు, బ్యాంకులు, ఈ-కామర్స్ సంస్థలు, టెక్స్‌టైల్స్, ఎయిర్‌లైన్స్, డిఫెన్స్ సంస్థలు ఈ ఎగవేతలకు పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.

Related posts

Leave a Comment