వెంకీ .. చైతూ మల్టీ స్టారర్ మూవీ లాంచ్

అనిల్ రావిపూడితో వెంకటేశ్
నెక్స్ట్ మల్టీ స్టారర్ మూవీ బాబీతో
మరో హీరోగా నాగచైతన్య
ఒక వైపున వెంకటేశ్ .. వరుణ్ తేజ్ తో కలసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక ‘మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి ‘ఎఫ్ 2’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక కొంతసేపటి క్రితం ఆయన మరో మల్టీస్టారర్ మూవీ లాంచ్ అయింది. హైదరాబాద్ .. రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది.

బాబీ దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాలో మరో హీరోగా నాగచైతన్య నటిస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమయ్యే ఈ సినిమాలో, చైతూ జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపిక అయింది. వెంకీ సరసన ఎవరు చేయనున్నారనే విషయంలో స్పష్టత రావలసి వుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారు. దీనికి ‘వెంకీ మామ’ అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు. చందూ మొండేటితో ‘సవ్యసాచి’ .. మారుతితో ‘శైలజా రెడ్డి అల్లుడు’ చేస్తోన్న చైతూ, ఈ రెండు సినిమాలతో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం.

Related posts

Leave a Comment