‘వీర భోగ వసంత రాయలు’ టైటిల్ పోస్టర్ రిలీజ్

  • దర్శకుడిగా ఇంద్రసేన పరిచయం 
  • భారీ తారాగణంతో మల్టీ స్టారర్ 
  • త్వరలోనే పూర్తి వివరాలు  

నారా రోహిత్ విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ .. నటన పరంగా తనని తాను మలచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఇక శ్రీవిష్ణు కూడా ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంపిక చేసుకుంటూ .. నటుడిగా మంచి మార్కులను కొట్టేస్తున్నాడు. సుధీర్ బాబు విషయానికే వస్తే మంచి కథల కోసం వెయిట్ చేస్తూ .. విజయాలను అందుకుంటున్నాడు. అలాంటి ఈ ముగ్గురి కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ మూవీ రూపొందుతోంది.

ఈ ముగ్గురితో సమానమైన పాత్రను శ్రియ పోషిస్తుంది. అప్పారావు నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఇంద్రసేన దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆసక్తిని రేకెత్తించే ఈ కథకి ‘వీర భోగ వసంత రాయలు’ అనే టైటిల్ ను ఇంతముముందే నిర్ణయించారు .. తాజాగా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. టైటిల్ రాసిన విధానాన్ని బట్టి చూస్తే, నాలుగు ప్రధాన పాత్రల పేర్లతో ఈ టైటిల్ ను సెట్ చేశారనిపిస్తోంది. త్వరలోనే పూర్తివివరాలు తెలియనున్నాయి.

Related posts

Leave a Comment