‘విశ్వరూపం 2’ విడుదలకి ముహూర్తం ఖరారు

  • కమల్ హీరోగా ‘విశ్వరూపం 2’
  • కథానాయికగా పూజా కుమార్ 
  • సంగీత దర్శకుడిగా గిబ్రాన్    

కమలహాసన్ నుంచి చాలాకాలం క్రితం వచ్చిన ‘విశ్వరూపం’ అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాకి సీక్వెల్ ను కూడా కమల హాసన్ రూపొందించారు. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదలకి నోచుకోకుండా అలా ఉండిపోయింది. ఈ సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి కమల్ చేసిన ప్రయత్నాలు ఫలించి .. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతోంది.

దేశభక్తికి సంబంధించిన కథా కథనాలు కావడం వలన, స్వాతంత్ర్య దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఆగస్టు 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు కమల్ ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం విడుదల చేయడానికి ఆయన సన్నాహాలు చేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి తెలుగు ట్రైలర్ ను ఎన్టీఆర్ .. తమిళ ట్రైలర్ ను శ్రుతి హాసన్ .. హిందీ ట్రైలర్ ను అమీర్ ఖాన్ రిలీజ్ చేయనున్నారు. కథానాయికగా పూజా కుమార్ నటించిన ఈ సినిమాకి, గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చారు.

Related posts

Leave a Comment