విశాఖలో జనసేన నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

సీతమ్మధారలో కొత్త కార్యాలయం
ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబాటుకు పాలకుల నిర్లక్ష్యమే కారణం
నూతన కార్యాలయం ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారానికి వేదిక కావాలని పవన్ ఆకాంక్ష
విశాఖపట్నంలోని సీతమ్మధారలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారానికి నూతన కార్యాలయం వేదిక కావాలని ఆకాంక్షించారు. ‘‘ అన్ని వనరులు ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడిపోవడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణం. దీనికి కారణాలను అన్వేషించడంతోపాటు ఈ ప్రాంత సమస్యలకు పరిష్కారాలు సూచించి, అభివృద్ధికి బాటలు వేసేందుకు ఈ కార్యాలయం వేదిక కావాలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రంలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో పవన్ కల్యాణ్ సమావేశమై చర్చలు నిర్వహించారు. ఈ వివరాలను పార్టీ మీడియా విభాగం హెడ్ పి.హరిప్రసాద్ వెల్లడించారు.

Related posts

Leave a Comment