విమానంలో పైలట్ల డిష్యుం.. డిష్యుం..!

లండన్‌ నుంచి ముంబయి వస్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో ఇద్దరు పైలట్లు ఘర్షణకు దిగారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. ఘర్షణ విషయాన్ని జెట్‌ఎయిర్‌వేస్‌ ధ్రువీకరించింది. ఈ నెల 1న ఈ ఘటన జరగ్గా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ నెల ఒకటో తేదీన 324 మంది ప్రయాణికులతో జెట్‌ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం లండన్‌ నుంచి ముంబయికి బయల్దేరింది. విమానం గాల్లో ఉండగా కాక్‌పిట్‌లోని ఇద్దరు పైలట్ల మధ్య సమాచార మార్పిడిలో లోపం కారణంగా వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఇద్దరు బాహాబాహీకి దిగారు. అయితే, ఆ వివాదం కొద్దిసేపటికి సమసిపోయిందని, ప్రయాణికులంతా సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారని జెట్‌ఎయిర్‌వేస్‌ అధికారి ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సదరు పైలెట్లను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. ఈ విషయాన్ని డీజీసీఏకు నివేదించారు.

Related posts

Leave a Comment