వాట్సాప్, ఫేస్ బుక్ లో అశ్లీల చిత్రం పెడితే జైలుకే

  • చట్టానికి సవరణలు తేనున్న కేంద్ర ప్రభుత్వం
  • అన్ని వేదికల్లోనూ మహిళల గౌరవానికి భంగం కలగకుండా చూసే చర్యలు
  • సవరణలను ప్రతిపాదించిన మహిళా, శిశు సంక్షేమ శాఖ

డిజిటల్ సందేశాల వేదికలు, సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్ బుక్ తదితర చోట్ల మహిళలను అగౌరవపరిచినా, వారిని అసభ్యంగా చిత్రీకరించినా చట్టవ్యతిరేకమైన చర్య కానుంది. దీన్ని శిక్షాత్మక చర్యగా మార్చేందుకు ‘ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ (ప్రొహిబిషన్)యాక్ట్ (ఐఆర్ బ్ల్యూఏ)1986’కు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయనుంది. ఈ సవరణలను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదించింది. జాతీయ మహిళా కమిషన్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సూచనలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం చట్టానికి చేయాల్సిన సవరణలను సూచించింది. ఇటీవలి కాలంలో టెక్నాలజీ పరంగా ఎంతో ఆధునికత సంతరించుకోవడం, ఎన్నో సమాచార సాధనాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇది అవసరమన్నది మంత్రిత్వ శాఖ అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఏ మాధ్యమంలో అయినా మహిళలను అసభ్యంగా చూపించకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అభిప్రాయం ఉందని మహిళా, శిశు సంక్షేమ శాఖ తెలిపింది.

Related posts

Leave a Comment