వాజ్‌పేయికి మాధురీ దీక్షిత్‌ను పరిచయం చేసి గులాబ్‌జామ్‌లు

  • అధికారిక విందులో గులాబ్‌జామ్‌లు
  • వాజ్‌పేయి దృష్టిపడకుండా అధికారులు నానా పాట్లు
  • చివరికి మాధురీ దీక్షిత్ సాయంతో తప్పించిన వైనం

వాజ్‌పేయికి జిహ్వచాపల్యం ఎక్కువ. ఆహారం ఏదైనా ఇష్టంగా తినేవారు. ఇక, నాన్-వెజ్ గురించి చెప్పక్కర్లేదు. స్వీట్లన్నా కూడా ఆయనకు ఎంతో ప్రీతి. అందులోనూ గులాబ్‌జామ్‌లంటే మరీను. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఓసారి ఇచ్చిన అధికారిక విందులో గులాబ్‌జామ్‌లను కూడా వడ్డించారు. అయితే, ఆరోగ్య రీత్యా వాజ్‌పేయి వాటిని తినడం మంచిది కాదు. మరి వాటిపై ఆయన దృష్టి మళ్లకుండా ఏం చేయాలి? అధికారులకు పెద్ద చిక్కే వచ్చి పడింది.

చివరికి ఓ ఉపాయం ఆలోచించారు. ఇదే విందుకు వచ్చిన బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌ సాయంతో వాజ్‌పేయి దృష్టిని విజయవంతంగా మళ్లించగలిగారు. మాధురీ దీక్షిత్‌ను పలకరించిన అధికారులు.. ఆమెను తీసుకెళ్లి వాజ్‌పేయికి పరిచయం చేశారు. దీంతో ఇద్దరి మధ్య సినిమాల ముచ్చట వచ్చింది. వారిద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో అధికారులు గులాబ్‌జామ్‌లను అక్కడి నుంచి మెల్లిగా తీసేశారు. అలా ఆ గండం నుంచి అధికారులు బయటపడి ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

Leave a Comment