వదినతో గొడవ.. తోపులాటలో కిందపడ్డ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి..

వదిన భూమిని కొనుగోలు చేసిన గిడ్డి ఈశ్వరి
నిర్మాణం పనులు చేపట్టే విషయంలో గొడవ
ఇద్దరి మధ్య తోపులాట
విశాఖపట్నం జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఆమె వదిన విజయలక్ష్మిలు గొడవపడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే, తన స్వగ్రామం కుమ్మరిపుట్టులో తన వదనకు చెందిన భూమిని రూ. 2 లక్షలకు ఈశ్వరి కొనుగోలు చేశారు. ఆ భూమిలో ఆమె ఇంటి నిర్మాణం పనులను చేపట్టారు. ధాన్యం నిల్వ కోసం గదిని నిర్మించే క్రమంలో ఇద్దరి మధ్య నిన్న వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ నేపథ్యంలో, ఇద్దరూ ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో, ఈశ్వరి కింద పడిపోయారు. ఆ తర్వాత కూడా ఇద్దరూ వాదులాడుకున్నారు. ఈ విషయంపై ఈశ్వరిని మీడియా ప్రశ్నించగా… ఇది తమ కుటుంబ వ్యవహారమని, దీన్ని సోషల్ మీడియాలో పెట్టడం తగదని చెప్పారు.

Related posts

Leave a Comment