వచ్చాడు చూడు

రవితేజ కథానాయకుడిగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘టచ్‌ చేసి చూడు’. రాశీ ఖన్నా, సీరత్‌కపూర్‌ కథానాయికలు. విక్రమ్‌ సిరికొండ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం రీరికార్డింగ్‌ పనులు జరుగుతున్నాయి. శుక్రవారం మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘రవితేజ ఇమేజ్‌కి తగ్గట్టుగా మంచి కథని సిద్ధం చేశారు వక్కంతం వంశీ. ఆ కథని విక్రమ్‌ సిరికొండ తెరపైకి తీసుకొచ్చిన విధానం బాగుంది. మా మిత్రుడైన రవితేజతో ఈ సినిమాని నిర్మిస్తుండడం ఆనందంగా ఉంద’’న్నారు. ఈ చిత్రానికి సంగీతం: జామ్‌ 8, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు.

Related posts

Leave a Comment