లోక్‌సభకు ‘ముందస్తు’ అయితే ఓకే.. కానీ అసెంబ్లీకి అయితే నో!: చంద్రబాబు

జమిలి ఎన్నికలకు కేంద్రం యోచన
షెడ్యూలు ప్రకారమే శాసనసభ ఎన్నికలు
అవసరమైతే న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటాం
ముందస్తు ఎన్నికలకు కేంద్రం సిద్ధమవుతున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం రాత్రి గుంటూరు జిల్లా పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని కేంద్రం యోచిస్తోందని‌, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్రం చెబుతున్న ముందస్తు లోక్‌సభ ఎన్నికలకు అయితే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ అసెంబ్లీకి కూడా నిర్వహిస్తామంటే అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. అవసరమైతే ఈ విషయమై న్యాయ నిపుణలను సంప్రదిస్తామని పేర్కొన్నారు.

ఇటీవల నెల్లూరులో నిర్వహించిన దళిత తేజం బహిరంగ సభ విజయవంతమైందని, ఈ సభ టీడీపీ ప్రతిష్ఠను పెంచిందని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మున్ముందు రాష్ట్రవ్యాప్తంగా 75 బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు చెప్పారు. త్వరలో నిర్వహించనున్న మైనారిటీ సదస్సును కూడా విజయవంతం చేయాలని జిల్లా పార్టీ నేతలను కోరారు.

Related posts

Leave a Comment