లోకేష్ అసెంబ్లీకి పోటీ చే్యడంపై చినరాజప్ప కీలక వ్యాఖ్యలు

తనకు నచ్చిన చోటి నుంచి పోటీ చేస్తారు
పవన్ మాదిరిగా పార్ట్ టైమ్ నాయకులం కాదు
బీజేపీతో పవన్, జగన్ కుమ్మక్కయ్యారన్న చినరాజప్ప
వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో, తనకు నచ్చిన నియోజకవర్గం నుంచి నారా లోకేష్ పోటీ పడతారని, గెలిచి చూపిస్తారని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తూర్పు గోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన, “ఎన్నికల్లో గెలవలేని లోకేష్”… అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించి మండిపడ్డారు. తామేమీ పవన్ కల్యాణ్ మాదిరిగా పార్ట్ టైమ్ రాజకీయ నాయకులం కాదని చెప్పిన చినరాజప్ప, లోకేష్ ఎన్నికల్లో గెలిచి చూపిస్తారని అన్నారు. భారతీయ జనతా పార్టీతో పవన్, జగన్ లు కుమ్మక్కయ్యారని, వారి కుట్రా రాజకీయాలను ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా బరిలోకి దిగనుందని చినరాజప్ప చెప్పారు.

Related posts

Leave a Comment