‘లోకేష్‌’ దూకుడుకు ‘బాబు’ కళ్లెం వేస్తున్నారా…?

ఆటు పార్టీ వ్యవహారాల్లో…ఇటు మంత్రి హోదాలో పాలానాపరమైన విధానమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో పంచాయితీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్‌ను ఎమ్మెల్సీ, కేంద్ర పార్టీ కార్యాలయ ఇన్‌ఛార్జి జనార్ధన్‌ అప్రదిష్ట పాలు చేయడమే కాకుండా ప్రతిష్టను మంటగలుపుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి రావడంతో..ఆయన దూకుడును పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది. పంచాయితీ కార్యదర్శుల నియామకంలో ఆశాఖాధిపతి, కమీషనర్‌ తప్పుడు సలహాలు విని..అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా పంచాయితీ కార్యదర్శులను నియమించేందుకు నిర్ణయం తీసుకోవడం, వెంటనే ఉత్తర్వులు జారీ చేయడం పలు వివాదాలకు కారణమైంది. ఆర్థికపరంగా ఇతర ముఖ్యబాధ్యుడుగా ఉండే పంచాయితీకార్యదర్శిని ప్రభుత్వ స్థాయిలో నియమించినప్పుడే బాధ్యతగా పనిచేస్తారే తప్ప…అవుట్‌సోర్సింగ్‌ విధానంతో నియమించిన వారు ఏ విధంగా బాధ్యతగా పనిచేస్తారు..? ఈ విషయాన్ని మంత్రి లోకేష్‌కు చెప్పాల్సిన పంచాయితీరాజ్‌ కార్యదర్శి ఆయనను తప్పుదోవ పట్టించి..వ్యవస్థకు అప్రదిష్ట పాలు చేశారనే విమర్శలు వస్తున్నాయి.

ఒకవైపు పంచాయితీరాజ్‌ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ‘జవహర్‌రెడ్డి’కి గ్రామీణాభివృద్ధిశాఖను కూడా కేటాయించే విధంగా ఒత్తిడి తెచ్చారు మంత్రి లోకేష్‌. ఆశాఖ డైరెక్టర్‌గా జూనియర్‌ ఐఎఎస్‌ను నియమించడం కూడా పలు వివాదాలకు కారణమైంది. ఈశాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాల్లో, పైళ్ల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంలో మంత్రి లోకేష్‌ సరైన రీతిలో వ్యవహరించలేకపోతున్నారు. అంతే కాకుండా సీనియర్‌ రాజకీయనాయకుల వారుసులను, ప్రజల్లో కార్యకర్తల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నవారు, తండ్రి,తల్లి పదవులను అడ్డుపెట్టుకుని…లంచాలు తీసుకుంటున్న వారు ‘లోకేష్‌’ చుట్టూ ఉంటారనే విషయం చంద్రబాబు దృష్టికి వచ్చింది. పార్టీకి సంబంధించిన నిర్ణయాలన్నీ స్వయంగా ‘చంద్రబాబే’ తీసుకోవడంపార్టీ సీనియర్‌ నేతలను ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఎమ్మెల్సీ టి.డి.జనార్థన్‌ను పార్టీ కార్యాలయ ఇన్‌ఛార్జిగా తొలగించాలని ‘చంద్రబాబు’ నిర్ణయం తీసుకున్నారట. తన కుమారుడుని..తప్పుదోవ పట్టిస్తుందని ఆయనేనని, ఆయనను సాగనంపాలని ‘బాబు’ భావిస్తున్నారట.

పంచాయితీరాజ్‌లో వందల కోట్ల నిధులను దుర్వినియోగం చేయడంలో ‘టి.డి.జనార్థన్‌, ‘జవహర్‌రెడ్డి’లది ముఖ్యపాత్ర అని…వారి వల్లే ‘లోకేష్‌’కు చెడ్డపేరు వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారట. ఎన్నికలు ఎప్పుడు జరిగినా…అభ్యర్థుల ఎంపికలో ‘చంద్రబాబు’ పార్టీలో వివిధ హోదాలో పనిచేస్తోన్న నాయకుల సిఫార్సులను, లోకేష్‌ చేసే సిఫార్సులను పరిగణలోకి తీసుకోరని సీనియర్‌ నాయకులు నమ్ముతున్నారు. అందుకేనేమో..ఈ మధ్య కాలంలో మంత్రి లోకేష్‌ను కలిసేవారు పెద్దగా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్‌ దూకుడును కట్టడి చేస్తారా..? కుటుంబ పరమైన ఒత్తిడిలకు తలగ్గి మౌనం వహిస్తారా..? వేచి చూడాల్సిందే…!

Related posts

Leave a Comment