రైతు రుణ మాఫీ ప్రకటించిన కుమారస్వామి.. షరతులు వర్తిస్తాయ్!

రూ. 34 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేయనున్నాం
రూ. 2 లక్షల లోపు రుణాలు మాఫీ
రుణాలు చెల్లించిన వారి అకౌంట్లలోకి రూ. 25 వేలు
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి… ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆయన… రాష్ట్ర వ్యాప్తంగా రూ. 34 వేల కోట్ల రుణాలను మాఫీ చేయనున్నట్టు ప్రకటించారు. తొలిదశలో డిసెంబర్ 31లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. రుణాలను సక్రమంగా చెల్లించిన రైతులకు కూడా ఆయన గుడ్ న్యూస్ చెప్పారు.

సకాలంలో రుణాలను చెల్లించిన రైతుల అకౌంట్లలోకి రూ. 25 వేల చొప్పున జమ చేస్తామని తెలిపారు. రూ. 2 లక్షల లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. కొందరు రైతులు రూ. 40 లక్షల వరకు రుణాలు తీసుకున్నారని… అంత మొత్తంలో రుణమాఫీ చేయడం సబబు కాదు కాబట్టి… రూ. 2 లక్షల లోపు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న కుటుంబాలకు, సహకార రంగంలో సొంత భూములను కలిగి ఉన్న రైతులకు రుణమాఫీ వర్తించదని చెప్పారు. గత మూడేళ్ల నుంచి ఆదాయపు పన్ను చెల్లించిన రైతులు కూడా రుణమాఫీకి అనర్హులని తెలిపారు.

Related posts

Leave a Comment