రేపటి నుంచి ఐదురోజులు మూత పడనున్న బ్యాంకులు!

రేపటి నుంచి ఐదురోజులు మూత పడనున్న బ్యాంకులు!

మీకేవైనా బ్యాంకు పనులున్నాయా? అయితే ఈ రోజే చేసుకోండి. ఎందుకంటే రేపటి నుంచి వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. సెప్టెంబరు 1 నుంచి 5వ తేదీ వరకు బ్యాంకులు తెరుచుకోవు. శనివారం పనిదినమైనా కొన్ని రాష్ట్రాల్లో సెలవే. మరికొన్ని రాష్ట్రాల్లో ఒక పూట మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తాయి. 2వ తేదీ ఆదివారం. 3వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి. 4, 5 తేదీల్లో యునైటెడ్ ఫోరం ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫోరం (యూఎఫ్ఆర్‌బీవోఈ) సమ్మెకు పిలుపునిచ్చింది. ఆ రెండు రోజులు భారతీయ రిజర్వు బ్యాంకు సిబ్బంది మూకుమ్మడి సెలవులు పెట్టే అవకాశం ఉంది. ఫలితంగా దేశ్యాప్తంగా బ్యాంకుల కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఆ రెండు రోజులు బ్యాంకులు తెరుకున్నా లావాదేవీలు జరగకపోవచ్చు. అంటే, మొత్తంగా ఐదు రోజులు బ్యాంకులు పనిచేయనట్టే లెక్క.

Tags: banks, long ,holidays, this ,month,working days

Related posts

Leave a Comment