రూ.500 డ్రా చేస్తుంటే రూ.2500 ఇస్తున్న ఏటీఎం..

  •  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం వద్ద భారీ క్యూ!
  • ఏటీఎంలో సాంకేతిక సమస్య
  • దావానలంలా వ్యాపించిన వార్త
  • నిపుణులను పంపి సరిచేయించిన బ్యాంకు అధికారులు

హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్‌లో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంకు గురువారం ఖాతాదారులు పోటెత్తారు. రూ.500 డ్రా చేస్తే ఏకంగా రూ.2500 వస్తుండడంతో డబ్బులు డ్రా చేసుకునేందుకు జనాలు పోటెత్తారు. పెద్ద ఎత్తున నగదు డ్రా చేసుకుని వెళ్లారు. ఈ వార్త కాస్తా వైరల్ అయి విషయం హెచ్‌డీఎఫ్‌సీ అధికారులకు చేరింది.

వెంటనే అప్రమత్తమైన అధికారులు మిషన్‌ను సరిచేసేందుకు నిపుణులను పంపారు. సాంకేతిక కారణాల వల్లే ఇలా జరిగినట్టు గుర్తించిన బ్యాంకు అధికారులు డబ్బులు డ్రా చేసుకున్న వారిని గుర్తించే పనిలో పడ్డారు. కాగా, ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సార్‌నగర్ పోలీసులు తెలిపారు.
500 ,draw, chesthe, 2500, isthunna,atm,atm machine,hdfc bank

Related posts

Leave a Comment