రూ.499కే రిలయన్స్ జియోఫి డాంగిల్ ను పొందే ఆఫర్

జియోఫి డాంగిల్ తో పాటు పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకున్న వారికే
12 నెలల పాటు ప్లాన్ రెన్యువల్ చేసుకోవాలి
ఆ తర్వాత రూ.500 క్యాష్ బ్యాక్
నేటి నుంచే ఆఫర్ అమల్లోకి
రిలయన్స్ జియో తన జియోఫి డాంగిల్ పై రూ.500 క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ నేటి నుంచే అమల్లోకి వచ్చింది. జియోఫి డాంగిల్ తోపాటు పోస్ట్ పెయిడ్ కనెక్షన్ ను తీసుకున్న వారికే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ అమలవుతుంది. దీంతో క్యాష్ బ్యాక్ పోన్ జియోఫి డాంగిల్ రూ.499కే లభించినట్టు అవుతుంది. జియోఫి డేటా కార్డును జియోస్టోర్లు, అమేజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్ నుంచి పొందొచ్చు. జియోఫి డాంగిల్ కొనుగోలు చేసేవారు కనీసం రూ.199తో కూడిన పోస్ట్ పెయిడ్ ప్లాన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వరుసగా 12 నెలల పాటు ప్రతీ నెలా పోస్ట్ పెయిడ్ రెన్యువల్ చేసుకుంటూ వెళితే ఆ తర్వాత కస్టమర్ కు రూ.500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీన్ని 13వ నెల నుంచి బిల్లుల్లో సర్దుబాటు చేసుకోవచ్చు.

Related posts

Leave a Comment