రూ.2 వేల నోట్ల రద్దుకు చంద్రబాబు పోరాడుతున్నారు :మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్య

సచివాలయంలో ఐసీఐసీఐ బ్యాంకు శాఖ ప్రారంభం
రూ.2 వేల నోట్ల వల్ల అవినీతి పెరిగే అవకాశం ఉందని ఆందోళన
నోట్ల రద్దు తర్వాత కేంద్రం తీసుకొచ్చిన రూ.2 వేల నోటును రద్దు చేయాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. దేశంలో రూ.500కు మించి పెద్ద నోటు ఉండకూడదన్నది తమ విధానమన్నారు. రూ.2 వేల నోటు వల్ల దేశంలో అవినీతి మరింత పెచ్చరిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద నోట్లు రద్దు చేయాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2012 నుంచి పోరాడుతున్నారని పేర్కొన్నారు. రూ.1000, రూ.500 నోట్ల రద్దు చేయాలని గతంలోనూ డిమాండ్ చేసినట్టు చెప్పారు. సచివాలయంలో ఐసీఐసీఐ బ్యాంకు శాఖను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Tags: 2000 notes, denomination,nara lokesh,icici banck sachivalayam,ifsc code

Related posts

Leave a Comment