రాష్ట్రానికి శాపం వెంకయ్య ఉప రాష్ట్రపతి కావడమే: జేసీ దివాకర్ రెడ్డి

మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం ఏపీకి బెల్లం ముక్క కూడా ఇవ్వరు
ఇదే విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పా
టీడీపీ ఎంపీల నిరసన దీక్షలో జేసీ స్పందన
వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నంత వరకు ఏపీకి బాగానే ఉందని… ఆయన ఉప రాష్ట్రపతి కావడం కూడా మన రాష్ట్రానికి ఒక శాపంగా మారిందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం ఏపీకి బెల్లం ముక్క కూడా ఇవ్వరని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా చెప్పానని తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ప్రయత్నాలు తాము చేయాలని చంద్రబాబు చెప్పారని అన్నారు. రాష్ట్రానికి ఎన్నో హామీలిచ్చి మోసం చేయడం కేంద్ర ప్రభుత్వానికి న్యాయమా? అని ప్రశ్నించారు.

ఏపీ పట్ల కేంద్రం చూపుతున్న వివక్షకు నిరసనగా అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో టీడీపీ ఎంపీలు నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.

Related posts

Leave a Comment