రాత్రి నుంచి దంచికొడుతున్న వాన…

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం
ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
తెరచుకున్న ప్రాజెక్టుల గేట్లు
తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో గత రాత్రి నుంచి వానలు దంచికొడుతున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. దీంతో జన జీవితం అస్తవ్యస్థమైంది. గత రాత్రి 12 గంటల సమయం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వర్షం పడుతూనే ఉంది. దీంతో ఈ ఉదయం స్కూళ్లకు వెళ్లాల్సిన విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లాల్సిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రహదారులపై నీరు చేరగా, లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు ప్రవేశించడం ప్రారంభమైంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మరోవైపు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు తోడు, గోదావరి పరీవాహక ప్రాతంలో పడుతున్న వర్షాలకు నదిలో వరదనీరు మరింత ఎక్కువైంది. తెలంగాణలోని పలు ప్రాజెక్టుల గేట్లను అధికారులు తెరచారు. కడెం ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తారు. 700 అడుగుల నీటిమట్టం ఉండే ఈ రిజర్వాయర్ లో ఇప్పటికే 698 అడుగుల నీరు చేరడంతో వచ్చిన నీటిని వచ్చినట్టు కిందకు వదులుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కొమురం భీం ప్రాజెక్టుకు వరద పోటు ఎక్కువగా ఉండటంతో మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో భద్రచాలం వద్ద గోదావరి నీటిమట్టం మరింతగా పెరిగింది.

Related posts

Leave a Comment