రాజీనామా చేస్తారా? చస్తారా?… ఉగ్రవాదుల ట్వీట్ తో నాలుగు రోజుల్లోనే 40 మంది పోలీసుల రిజైన్!

ఉద్యోగాలకు రాజీనామా చేసి, ఇంటికి పరిమితం కాకుంటే మరణం తప్పదంటూ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు ట్వీట్ చేసిన తరువాత, నాలుగు రోజుల వ్యవధిలో 40 మంది పోలీసులు రిజైన్ చేసినట్టు తెలుస్తోంది. కాశ్మీరు లోయలో 30 వేల మందికి పైగా ఎస్పీఓ (స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు) ఉన్నారని, ఆ సంఖ్యతో పోలిస్తే, రాజీనామాలు సమర్పించిన వారి సంఖ్య నామమాత్రమేనని జమ్ము కశ్మీర్ చీఫ్ సెక్రెటరీ బీవీఆర్ సుబ్రమణియమ్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్ లోయలో తమకు దొరికిన పోలీసు అధికారులను దొరికినట్టు హత్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత వారంలో ముగ్గురు పోలీసులను వారి ఇళ్ల నుంచి కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు వారిని దారుణంగా చంపేశారు. వారిపై బులెల్ల వర్షం కురిపించారు. ఆపై సోషల్ మీడియాలో పోలీసులు రాజీనామా చేస్తున్న వీడియోలను ఉగ్రవాదులు వైరల్ చేయగా, ప్రభుత్వ వర్గాలు ఖండించాయి.
Tags: maoists,terrorists,ministers,warning

Related posts

Leave a Comment