రాజశేఖర రెడ్డి బయోపిక్ లో సుహాసిని?

  • షూటింగు దశలో ‘యాత్ర’
  • ప్రధాన పాత్రలో మమ్ముట్టి 
  • సూరీడు పాత్రలో పోసాని

దర్శకుడు మహి వి.రాఘవ … వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ ను రూపొందిస్తున్నాడు. రాజశేఖర రెడ్డి తన పాదయాత్ర ద్వారా ప్రజలను ఎంతో ప్రభావితం చేశారు గనుక, ఈ సినిమాకి ‘యాత్ర’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఆయన పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది.

ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి భార్య పాత్ర కోసం ‘ఆశ్రిత వేముగంటి’ని ఎంపిక చేసుకున్నారు. ‘బాహుబలి 2’ సినిమాలో ‘కన్నా నిదురించరా ..’ అనే పాటలో అనుష్కతో పాటు ఆశ్రిత వేముగంటి మెరిసింది. ఈ పాటతో ఆమె అందరినీ తనవైపుకు తిప్పుకుంది. ఇక ఈ సినిమాలో సబితా ఇంద్రారెడ్డి పాత్ర కూడా కీలకంగా కనిపించనుంది. ఈ పాత్ర కోసం సుహాసినిని ఎంపిక చేశారనేది తాజా సమాచారం. పాత్రకి గల ప్రాధాన్యత కారణంగానే సుహాసిని అంగీకరించిందని అంటున్నారు. వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణమురళిని తీసుకోవడం కూడా ఆసక్తిని రేకెత్తించే అంశమేనని చెప్పాలి.

Related posts

Leave a Comment