రాజమౌళి మల్టీ స్టారర్ మూవీ రీమేక్ కాదు: నిర్మాత దానయ్య

రాజమౌళి మల్టీ స్టారర్ మూవీ రీమేక్ కాదు: నిర్మాత దానయ్య

రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్
హీరోలుగా ఎన్టీఆర్ .. చరణ్
నిర్మాతగా డీవీవీ దానయ్య
రాజమౌళి దర్శకత్వంలో ఒక మల్టీ స్టారర్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ .. చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించనున్నారు. అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి ఒక వార్త షికారు చేస్తోంది. 1995లో వచ్చిన ‘కరణ్ అర్జున్’ అనే హిందీ సినిమాకి ఇది రీమేక్ అనేది ఆ వార్తలోని సారాంశం.

రాకేశ్ రోషన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ .. షారుక్ ఖాన్ ప్రధానపాత్రలు పోషించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. అదే సినిమాను రాజమౌళి రీమేక్ చేయనున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. దాంతో ఈ విషయంపై నిర్మాత డీవీవీ దానయ్య స్పందిస్తూ .. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి .. పూర్తి వివరాలను వెల్లడిస్తాం”అన్నారు.

Related posts

Leave a Comment