రాజమౌళి మల్టీస్టారర్‌లో..కీర్తి సురేష్‌

‘మహానటి’తో మనసుల్ని గెలుచుకుంది కీర్తి సురేష్‌. ఇప్పుడో మంచి అవకాశం ఆమె చేతుల్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ – ఎన్టీఆర్‌ కథానాయకులుగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉంది. ఓ నాయికగా కీర్తిని ఎంచుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. సెప్టెంబరులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. 2020లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ సినిమా కోసం హైదరాబాద్‌ శివార్లలో ప్రత్యేకంగా ఓ సెట్‌ను తీర్చిదిద్దుతున్నారు. సాబు సిరిల్‌ ఆధ్వర్యంలో సెట్‌ పనులు జరుగుతున్నాయి. ‘బాహుబలి’ టీమ్‌లో ఉన్న సెంథిల్‌, కీరవాణి ఈ చిత్రానికీ పనిచేయబోతున్నారు.

Related posts

Leave a Comment