రాజమహేంద్రవరం రోడ్‌ కం రైల్వే వంతెనపై జగన్‌

  • తూర్పు గోదావరి జిల్లా వెళుతోన్న జగన్‌
  • 4.1 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు కం రైలు వంతెన
  • జగన్‌కు వైసీపీ నేతలు, కార్యకర్తల ఘనస్వాగతం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్‌ వంతెన మీదుగా ఆయన తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. ఈరోజు సాయంత్రం కోటిపల్లి బస్టాండ్‌ వద్ద జగన్‌ బహిరంగ సభ నిర్వహిస్తారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మధ్య 4.1 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు కం రైలు వంతెన ఉంటుంది. వంతెన మీదుగా పాదయాత్ర ప్రవేశానికి మొదట పోలీసులు అనుమతివ్వని విషయం తెలిసిందే. చివరకు అన్ని అడ్డంకులు తొలగించుకుని జగన్ రోడ్డు కం రైల్‌ వంతెన మీదుగానే కొనసాగిస్తున్నారు. ఆయనకు అక్కడి వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు.

Related posts

Leave a Comment